విశ్వనాధునికి ఓ విన్నపం

విశ్వనాధునికి ఓ విన్నపం

విశ్వనాధునికి ఓ విన్నపం 

                 --డా.కోడి రామ(అల్ అయిన్,యూ.ఏ.ఈ)  

నిరీక్షించి,నిరీక్షించి నీరసించి పోతిమయ్యా,
నిర్ణయించితిమయ్యా నిటరాక్షునిక నిద్రలేపెదమని,
నీల కంధరా నిద్రమేల్కొని కరోనా మరణ 
మృదంగము నాపగ లేవా ప్రభూ!

మానవాళి మనుగడ దినదిన గుండమాయె,
నిర్జన నివిడాంధకారపురవీధులందు 
వన్యమృగములు సంచరించు చూ,మమ్ము 
పరిహసించు చున్నవి పన్నగ భూషణ!

క్షీరసాగర మధనమందు పెల్లుబికిన హాలహలం
గళమునందు బంధించి,దేవదానవుల కాపాడితిని కదా!
సామాన్యమానవుము మేము,శంకరమహా దేవా,
మాయదారి "కరోనా" ఇంటింటా మరణాల మోత
మొరాలకింపలేవా, శంకరా,నిటలాక్షు నిద్రలేపెద!

మొరాలకింపమని కలియుగ సార్వభౌముని మ్రొక్కితిమయ్య 
మూసిన తలుపులవెనుక స్వామి,విన్నపాలు వినకుండా,
తిరునగరి శ్రీనివాసుడు తిరిగి పొమ్మనె,
ఇదెక్కడి న్యాయమయ్యా శివయ్యా?
ఓం నమః శివాయ-నిటలాక్షు నిప్పుడే నిద్రలేపద

ఫాలనేత్ర,పశుపతినాథ,దిక్కుమాలిన 
కోవిదు నాగళమందు జేరి ఉక్కిరి బిక్కిరి 
చేసి,నాన్నొక్కని జేసి ఉక్కడగించుచున్నది 
ఇదెక్కడి న్యాయమయ్యా మృత్యుంజయా?

బుద్ధిహీనులమమ్మ,జ్ఞాన సూన్యులమమ్మ జ్ఞానప్రసూనాంబ 
యెవ్వనిజే జనించు జగమొవ్వాని లోపలనుండు
నిద్రమేల్కొని మము బ్రోవమని చెప్పు తల్లీ
నిజదార,సుతోదరపోషణ నిజంగా దుర్భరమయ్యె 
శ్రామిక మూగజీవులు మండుటెండలో,నడి
వీధుల జీతాలెరుగని,జీవితారాయె!
నిటలాక్షునిక నిద్ర లేపెదనే!

 

 

 

 

Back to Top