177 మంది బాలికల కోసం విమానం ఏర్పాటు చేసిన సోను సూద్
- May 29, 2020
కేరళ:వలస కార్మికులను వారి స్వస్థలాలకు తరలించేందుకు బస్సులను ఏర్పాటు చేసి అందరి అభిమానం అందుకుంటున్న బాలీవుడ్ నటుడు సోను సూద్ అక్కడితో తన సహాయాన్ని ఆపలేదు. ప్రతి రోజూ వలస కూలీలకు ఏదో ఒక రూపంలో సహాయం చేస్తూనే ఉన్నారు. ఒక్క వలస కూలీలనే కాదు తన సహాయం కోరి వచ్చిన ప్రతి ఒక్కరినీ ఆదుకుంటున్నారు. తాజాగా కేరళలో చిక్కుకున్న 177 మంది బాలికలను విమానంలో వారి రాష్ట్రానికి పంపించారు. ఈ అమ్మాయిలంతా కేరళలోని ఓ కుట్టు మిషన్ కర్మాగారంలో పని చేస్తున్నారు.
లాక్డౌన్ కారణంగా ఫ్యాక్టరీ మూతపడింది. దాంతో వారంతా అక్కడే చిక్కుకుపోయారు. సోనూ స్నేహితుడొకరు ఈ విషయాన్ని ఆయనకు చేరవేశారు. దాంతో వెంటనే సోనూ ఆ అమ్మాయిలందరికీ సహాయం చేయదలచి కొచ్చి, భువనేశ్వర్ విమానాశ్రయాలు నడపడానికి ప్రభుత్వం నుంచి అనుమతి కోరారు. ఒక ప్రత్యేక విమానంలో వారిని కొచ్చి నుండి భువనేశ్వర్ చేరవేస్తున్నారు. అక్కడి నుంచి వారు తమ ఇళ్లకు చేరుకుంటారు. సోనూ సూద్ సహాయం పొందిన ఓ గర్భిణీ తన కొడుక్కి సోనూ సూద్ శ్రీవాత్సవ అని పెట్టుకుంది. ఆ విషయం తెలిసి సోనూ తన హృదయం ఉప్పొంగి పోయిందన్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







