మస్కట్:మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు..నిన్న ఒక్క రోజే ఏడుగురు మృతి
- June 01, 2020
మస్కట్:ఒమన్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కరోనా వైరస్ సోకి నిన్న ఒక్క రోజే ఏడుగురు పేషెంట్లు మృతి చెందినట్లు ఒమన్ ఆరోగ్యా శాఖ మంత్రి డాక్టర్ అహ్మద్ అల్ సైది వెల్లడించారు. ఇందులో ఐదుగురు ఆస్పత్రి వెలుపల చనిపోయారు. మిగిలిన ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారని ఆయన తెలిపారు. అయితే..ఈ ఏడుగురు మృతితో ఇప్పటివరకు కరోనా కారణంగా చనిపోయిన వారి సంఖ్య 49కి పెరిగింది. ప్రస్తుతం 199 మంది పేషెంట్లు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు మంత్రి తెలిపారు. నిన్న ఒక్క రోజే 3,171 మందికి కరోనా టెస్టులు నిర్వహించామని..ఇప్పటివరకు లక్ష మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించామని అన్నారు. అయితే..ఇటీవల కరోనా కేసులు పెరిగాయని..ఈద్ సంబరాల్లో జనం గుమిగూడటం ఇందుకు కారణం అని ఆయన అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- బరాకా అణు విద్యుత్ కేంద్రం ఘటన పై యూఏఈ స్పందనకు IAEA ప్రశంసలు
- ఇరాన్ 75వేల మందిని హత్య చేసింది: ట్రంప్ సంచలన ఆరోపణలు
- దుబాయ్‌లో లగ్జరీ కార్లతో ఇన్సూరెన్స్ మోసం.. ఐదుగురికి జైలు శిక్ష
- WPL 2027 మినీ వేలం తేదీ ఖరారు..
- యూఏఈలో ఐదేళ్లలో రెట్టింపైన ప్రైవేట్ జెట్ రాకపోకలు..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల్లో వార్షికంగా 1.2% పెరుగుదల..!!
- ఒమన్‌లో వరుస కేబుల్ చోరీల నిందితుడు అరెస్ట్..!!
- కువైట్ పాఠశాలల్లో చైనీస్ భాష.. ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు..!
- నవంబర్ నాటికి ముహర్రఖ్ సూక్ రోడ్డు పనులు పూర్తి..!
- పాలపిట్టలను బంధిస్తే చట్టపరమైన చర్యలు: సీపీ సజ్జనార్







