ట్యాక్స్‌, రిజిస్ట్రేషన్‌ ఫీజు నుంచి ఉపశమనం

- June 01, 2020 , by Maagulf
ట్యాక్స్‌, రిజిస్ట్రేషన్‌ ఫీజు నుంచి ఉపశమనం

మస్కట్‌: కోవిడ్‌19 సుప్రీం కమిటీ నిర్ణయాల మేరకు, మస్కట్‌ మునిసిపాలిటీ, రిజిస్ట్రేషన్‌ ఆఫ్‌ కాంట్రాక్ట్స్‌ (రెసిడెన్షియల్‌ మరియు కమర్షియల్‌) విషయమై కొన్ని వెసులుబాట్లు కల్పించనుంది. జరీమానాల చెల్లింపు, రిజిస్ట్రేషన్‌ ఫీజు అలాగే మునిసిపల్‌ ట్యాక్స్‌ వంటివాటి నుంచి కన్సెషన్లు, ఎగ్జంప్షన్లు లభించనున్నాయి. రెస్టారెంట్లు మరియు కేఫ్‌లకు సంబంధించి రెన్యువల్‌ ఫీజు అలాగే మున్సిపల్‌ ట్యాక్స్‌ని మార్చి 19 నుంచి ఆగస్ట్‌ 31 వరకు ఎగ్జంప్షన్‌ ఇవ్వడం జరిగింది. రెసిడెన్షియల్‌ మరియు కమర్షియల్‌ రెంటల్‌ కాంట్రాక్టులకు ఫిబ్రవరి 9 నుంచి జూన్‌ 1 వరకు ఎగ్జంప్షన్‌ ఇచ్చారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.

--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com