తెలంగాణ వాసి మృతి ఆదుకున్న తెలంగాణ జాగృతి కువైట్
- June 01, 2020
కువైట్ సిటీ:కువైట్ లో గుండెపోటుతో మరణించిన గల్ఫన్న...మృతదేహాన్ని స్వగ్రామానికి పంపేందుకు అండగా నిలిచిన తెలంగాణ జాగృతి కువైట్.
తెలంగాణ రాష్ట్రం,జగిత్యాల జిల్లా, గంభీర్ పూర్ గ్రామానికి చెందిన గంగాధర్ పబ్బా(44) అనే కార్మికుడు గుండెపోటుతో గత రెండు వారాలక్రితం మరణించడం జరిగింది. ఈ విషయాన్ని మృతుని భందువులు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత దృష్టికి తీసుకెళ్లడం జరిగింది కువైట్ లో ఉంటున్నా తెలంగాణ జాగృతి ప్రెసిడెంట్ ముత్యాల వినయ్ కి సమాచారం అందించడం జరిగింది. కువైట్ లో కర్ఫ్యూ ఉన్నందువల్ల ఇలాంటి కష్టమైన పరిస్థితుల్లో పార్థివ దేహాన్ని పంపిస్తానని మృతుని బంధువులకు ముత్యాల వినయ్ హామీ ఇచ్చారు. తెలంగాణ జాగృతి కువైట్ జనరల్ జనరల్ సెక్రెటరీ ప్రమోద్ కుమార్ మార్క లాక్ డౌన్ అయినప్పటికీ సేవా దృక్పథంతో. ఇండియన్ ఎంబసీ లో డాక్యుమెంటేషన్, కువైట్ గవర్నమెంట్ డాక్యుమెంటేషన్ మరియు పోలీస్ క్లియరెన్స్ ప్రాసెస్ పూర్తి చేశారు.అలాగే హైదరాబాద్ ఎయిర్పోర్టు నుండి వారి స్వగ్రామం వరకు ఉచిత అంబులెన్స్ సౌకర్యం కూడా కల్పించడం జరిగింది. ఈరోజు(01/06/2020) పార్థివదేహాన్ని తన స్వగృహానికి చేర్చడం జరిగింది.
కువైట్ తరుపున జాగృతి అధ్యక్షులు ముత్యాల విజయ్ కుమార్ మరియు వారి కమిటీ సభ్యులు ఎల్లప్పుడూ బాధితులకు అండగా ఉంటామని ఎటువంటి అవసరాలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని తెలియజేశారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







