దుబాయ్:ఫేస్ మాస్కుల ఆంక్షలపై పాక్షిక సడలింపులు..కొత్త మార్గనిర్దేశకాలు జారీ
- June 01, 2020
దుబాయ్:పబ్లిక్ ప్రదేశాల్లో ఉన్నప్పుడు మాస్కులు ధరించటంపై దుబాయ్ సుప్రీం కమిటీ కొత్త మార్గనిర్దేశకాలను జారీ చేసింది. మాస్కులపై ఉన్న ఖచ్చితమైన నిబంధనల నుంచి కొన్ని వర్గాలకు మినహాయింపు ఇచ్చింది. చిన్నపిల్లలు, శ్వాస సంబంధిత ఇబ్బందులు ఉన్నవారు పబ్లిక్ ప్రదేశాల్లోనూ మాస్కులు ధరించాల్సిన అవసరం లేదని కమిటీ ప్రకటించింది. అలాగే ప్రయాణాల్లో ఉన్న వారికి కూడా కొన్ని మినహాయింపులు ఇచ్చింది. ఒక్కరే డ్రైవ్ చేసుకుంటూ వెళ్లే సమయంలో తాత్కాలికంగా మస్కులను తీసివేయవచ్చు. వ్యక్తిగత వాహనాల్లో కుటుంబసభ్యులతో ప్రయాణం చేసే సమయంలోనూ తాత్కాలికంగా మాస్కులు తీసివేయవచ్చు. ఎక్సర్ సైజ్ చేసే సమయంలో, అనారోగ్య కారణాలతో చికిత్స పొందుతున్న వారు కూడా మాస్కులు ధరించాల్సిన అవసరం లేదని దుబాయ్ సుప్రీం కమిటీ స్పష్టం చేసింది.
--బాలాజీ(మాగల్ఫ్ ప్రతినిధి,దుబాయ్)
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







