వైద్యుడిగా మారిన యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్
- June 01, 2020
వైవిధ్యమైన సినిమాలు తో యంగ్ హీరో నిఖిల్ తనకంటూ ఓ సొంత ఇమేజ్ తెచ్చుకున్నాడు. నిఖిల్ ఎంచుకునే కథ, కథనాలే కాదు వాటిల్లో పాత్రలు కూడా చాలా వైవైద్యం గా ఉంటాయి. ఇక నిఖిల్ - డైరెక్టర్ చందు మొండేటి కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ కార్తికేయ కి ఇటీవలే సీక్వెల్ పనులు మొదలు అయ్యాయి. కార్తికేయ 2 టైటిల్ తో రెడీ అవుతున్న ఈ సినిమాలో నిఖిల్ డాక్టర్ గా నటిస్తున్నాడు. కార్తికేయ లో మెడికల్ స్టూడెంట్ గా నటించిన నిఖిల్ ఇప్పుడు ఈ సీక్వెల్ లో డాక్టర్ గా కనిపిస్తున్నాడు. ఇదే విషయాన్ని చెప్పకనే చెప్పేసారు కార్తికేయ 2 చిత్ర బృందం. నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా కార్తికేయ 2 చిత్ర యూనిట్ శుభాకాంక్షలు తెలుపుతూ ఒక పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ లుక్ లో నిఖిల్ మేడలో స్టేథస్ స్కోప్ ఉంది. అలానే వైద్యో నారాయణో హరి - వైద్యుడే నారాయణుడు - నారాయణుడే వైద్యుడు అని ఒక శ్లోకాన్ని దాని అర్థాన్ని కూడా ఈ పోస్టర్ లో పెట్టారు..! ఐతే ఇదే పోస్టర్ తో కరోనా తో యుద్ధం చేస్తున్న వైద్యులు కు కూడా కృతజ్ఞతలు తెలిపారు డైరెక్టర్ చందు మొండేటి మరియు చిత్ర బృందం
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







