ముంబై:తుపాను ప్రభావంతో రన్‌వేపై జారిన విమానం..!

- June 03, 2020 , by Maagulf
ముంబై:తుపాను ప్రభావంతో రన్‌వేపై జారిన విమానం..!

ముంబై:ఫెడ్‌ఎక్స్ కు చెందిన బెంగుళూర్ నుండి ముంబై కి చేరుకున్న ఓ విమానం రన్‌వేపై జారింది. ఈ ఘటన ముంబై విమానాశ్రయంలో జరిగింది. నిసర్గ తుపాను కారణంగా వీచిన గాలులు, వర్షం కారణంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక ఈ ఘటన నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం నుండి రాత్రి 7 వరకు విమాన రాకపోకలను ఆపివేశారు.

ఇక మరోవైపు నిసర్గ తుపాను మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో మహారాష్ట్ర తీర ప్రాంతం రాయ్‌గఢ్‌ జిల్లా ఆలీబాగ్‌ వద్ద తీరం దాటింది. దీంతో ముంబై నగరం తుపాను నుండి తప్పించుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com