అబుధాబి:మాస్కులను బహిరంగ ప్రదేశాల్లో పడేస్తే Dh1,000 ఫైన్..6 బ్లాక్ పాయింట్స్
- June 07, 2020
అబుధాబి:కరోనా వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా ఫేస్ మాస్క్ లపై ఫోకస్ చేశారు అబుధాబి పోలీసులు. చాలామంది వాహనదారులు వాడిన ఫేస్ మాస్కులను రోడ్డుపక్కన పడేసి వెళ్తున్నట్లు తాము గమనించామని వెల్లడించారు. ఇక నుంచి ఎవరైనా మాస్కులు బహిరంగ ప్రదేశాల్లో పడేస్తే..వారికి Dh1,000 జరిమానాతో పాటు 6 బ్లాక్ పాయింట్స్ కూడా ఇవ్వనున్నట్లు తెలిపారు. వాడి పారేసిన ఫేస్ మాస్కుల కారణంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయని, వైరస్ నియంత్రించేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతను సక్రమంగా నిర్వహించాలని అబుధాబి పోలీసులు వెల్లడించారు. మాస్కులను ప్లాస్టిక్ బ్యాగుల్లో వేసి..వాటి డస్ట్ బిన్ లో మాత్రమే పడేయాలని కూడా సూచించారు. ఇదిలాఉంటే..వారం రోజుల క్రితం అజ్మన్ పోలీసులు కూడా తమ పరిధిలో ఫేస్ మాస్కులను పడేయటంపై నిషేధం విధించింది. జూన్ 1 నుంచి ఈ నిర్ణయాన్ని అమలు చేస్తోంది. ఫేస్ మాస్కులు బహిరంగ ప్రదేశాల్లో పడేస్తే Dh1,000 జరిమానా, 6 బ్లాక్ పాయింట్ల విధానాన్ని అమలు చేసింది. ఇప్పుడు అదే నిబంధనలను అబుధాబి పోలీసులు కూడా అమలు చేస్తున్నారు. దీంతో ఫేస్ మాస్కులపై ఈ కొత్త నిబంధనలను దేశమంతా వర్తింపచేస్తారా? అందులో భాగంగానే ముందస్తుగా అజ్మన్, అబుధాబి ఎమిరాతి పరిధిలో అమలులోకి తీసుకొచ్చారా? అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.
తాజా వార్తలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్‌ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం







