కువైట్:కరోనా సంక్షోభంలో పొంచి ఉన్న మోసగాళ్లు..ఏటీఎం బ్లాక్ అయ్యిందంటూ టోకరా
- June 07, 2020
కువైట్:అసలే కరోనా వైరస్ ధాటికి ఆర్ధికంగా సంక్షోభం ఎదుర్కుంటున్న జనాలకు ఇప్పుడు మరో చిక్కొచ్చి పడింది. ప్రస్తుత సంక్షోభాన్ని ఆసరాగా చేసుకొని ప్రజల్ని మోసం చేసేందుకు కొత్త ఎత్తులు వేస్తున్నారు. కరోనా కారణంగా మీ ఏటీఎం కార్డు బ్లాక్ అయ్యిందంటూ మొబైల్ నెంబర్ కు మెసేజ్ చేస్తారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుంచి మెసేజ్ పంపించినట్లుగా నమ్మిస్తారు. ఎటీఎం కార్డు సేవలను పునరుద్ధరించాలంటే తమను ఫలానా నెంబర్ కు కాంటాక్ట్ చేయాలని మెసేజ్ లోనే ఓ నెంబర్ పింపిస్తారు. ఆ మెసేజ్ చూసి ఎవరైనా ఫోన్ చేస్తే మాయమాటలతో వారి బ్యాంక్ వివరాలు తెలుకొని అకౌంట్ నుంచి డబ్బు కాజేస్తారు. ఇటీవలి కాలంలో ఈ తరహా మెసేజ్ లు పెరిగిపోవటంతో కువైట్ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఏటీఎం బ్లాక్ అయ్యిదంటూ వచ్చే మెసేజ్ లకు స్పందించొద్దని సూచించారు.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!







