రికార్డులు సృష్టిస్తున్న సర్దార్ గబ్బర్ సింగ్
- January 31, 2016
విడుదలకు ముందే రికార్డులు సృష్టించడం పవన్ కు కొత్తేంకాదు. ప్రీ-బిజినెస్ లో పవర్ స్టార్ ది ఎప్పుడూ అప్పర్ హ్యాండే. అతడి సినిమాను కొనేందుకు డిస్ట్రిబ్యూటర్లు ఎగబడతారు. అందుకే పవన్ సినిమాకు నిధుల కొరత ఉండదు. టేబుల్ ప్రాఫిట్ తో సినిమా స్టార్ట్ చేసే అరుదైన అవకాశం నిర్మాతకు లబిస్తుంది. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా కళ్లుచెదిరే బిజినెస్ చేస్తోంది. ఇన్నాళ్లూ సినిమా లేటవుతుందని బాధపడుతున్న నిర్మాత శరత్ మరార్ ఇప్పుడు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. ఈ మధ్యే ఫ్యాన్సీ రేటుకు ఓవర్సీస్ రైట్స్ అమ్మేశారు. తాజాగా విశాఖ ఏరియా హక్కుల్ని దాదాపు 7.5 కోట్ల రూపాయలకు అమ్మేశారని తెలుస్తోంది.ఆ ప్రాంతంలో ఇంత మొత్తానికి ఓ సినిమా అమ్ముడుపోవడం రికార్డుగా చెప్పుకుంటున్నారు. మరోవైపు శాటిలైట్ రైట్స్ కు సంబంధించి చర్చలు సాగుతున్నాయి. ఇలా ప్రతి బిజినెస్ ఎలిమెంట్ ను పవనే దగ్గరుండి పర్యవేక్షిస్తూ శరత్ మరార్ కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తున్నాడట. అదీ పవర్ స్టార్ లెక్క.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







