మార్చ్ 30న అరబ్ గివింగ్ ఫోరమ్
- January 31, 2016
నాలుగవ అరబ్ ఫోరమ్ 'జాయెద్ గివింగ్ ఇనీషియేటివ్' బహ్రెయిన్‌లో మార్చ్ 30న ప్రారంభం కానుంది. రెండ్రోజులు జరిగే ఈ సింపోజియం, లేబర్ అండ్ సోషల్ డెవలప్‌మెంట్ మినిస్టర్ జమీల్ బిన్ మహమ్మద్ అల్ హుమాయిదాన్ నేతృత్వంలో అరబ్ వాలెంటరీ వర్క్ ఎక్స్‌పర్ట్స్ సమక్షంలో నిర్వహించబడుతుంది. నిర్మాణాత్మకమైన ఇలాంటి చర్యల యొక్క గొప్పతనాన్ని ఈ సందర్భంగా మినిస్టర్ జమీల్ ఉద్ఘాటించారు. యూఏఈలో కాకుండా మరో చోట ఈ కార్యక్రమం జరగడం ఇదే తొలిసారి అని ఆయన అన్నారు. జాయెద్ గివింగ్ ఇనీషియేటివ్ గొప్పతనాన్ని ఈ సందర్భంగా కొనియాడారాయన. అరబ్ సొసైటీ, సామాజిక బాధ్యతను గుర్తించి చేపడ్తున్న సామాజిక కార్యక్రమాల్ని ఆయన అభినందించారు. దివంగత షేక్ జాయెద్ బిన్ సల్తాన్ అల్ నహ్యాన్ కీర్తి ప్రతిష్టల్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. సంస్కృతీ సంప్రదాయాలు, సేవా మార్గాల్లో చేపడ్తున్న కార్యక్రమాలు వంటివి అరబ్ ప్రపంచంలో బహ్రెయిన్ పాత్రను గుర్తుచేస్తున్నాయని అరబ్ సొసైటీ ఫర్ సోషల్ రెస్పాన్సిబులిటీ ఛైర్మన్ సుల్తాన్ బిన్ అబ్దుల్ రహామ్మన్ చెప్పారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







