పశుగ్రాసం దుకాణాలపై దాడులు

- January 31, 2016 , by Maagulf
పశుగ్రాసం దుకాణాలపై దాడులు

సెంట్రల్‌ మార్కెట్‌లో పశుగ్రాసం దుకాణాలపై మినిస్ట్రీ ఆఫ్‌ ఎకానమీ కామర్స్‌ అధికారులు దాడులు నిర్వహించారు. నిబంధనల్ని ఉల్లంఘిస్తున్న దుకాణాలపై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా 9 నిబంధనల్ని ఉల్లంఘించినట్లు అధికారులు చెప్పారు. ఉత్పత్తులపై ధరలకు సంబధించిన ట్యాగ్‌ లేకపోవడం, అలాగే ఉత్పత్తులను అమ్మినప్పటికీ రశీదులు ఇవ్వకపోవడం, రశీదులపై 'ఒకసారి అమ్మిన వస్తువులు తిరిగి తీసుకోబడవు, మార్చబడవు' అని పేర్కొనడం, ఇవన్నీ నిబంధనల ఉల్లంఘన అని అధికారులు అన్నారు. ఇలాంటి నిబంధనల ఉల్లంఘనకు దుకాణాల మూసివేత, 1 మిలియన్‌ ఖతారీ రియాల్స్‌ వరకు ఫైన్‌ తప్పదని అధికారులు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com