ప్రవాసీయుడిని అవమానించి, దాడి చేసిన సౌదీ వ్యక్తి అరెస్ట్
- June 11, 2020
రియాద్:ప్రవాసీయుడిని అవమానించేలా అసభ్య పదజాలంతో దూషించటమే కాకుండా శారీరకంగా దాడికి తెగబడిన సౌదీ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రవాసీయుడు ధరించిన ఫేస్ మాస్క్ విషయంలో ఈ దాడి జరిగింది. సౌదీలో సాంప్రదాయకంగా తలపై వాడే షేమఘ్ కు వినియోగించే వస్త్రాన్నే..ప్రవాసీయుడు ఫేస్ మాస్క్ గా ధరించాడు. దాన్ని చూసి..కోపంతో ఊగిపోయిన సౌదీ వ్యక్తి ప్రవాసీయుడిని పరుష పదజాలంలో దూషించాడు. అంతేకాక అతనిపై దాడి చేశాడు. అయితే..ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావటంతో పోలీసులు సౌదీ వ్యక్తిపై చర్యలు చేపట్టారు. అతనిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. సౌదీలో వివక్షకు తావు లేదని, ప్రతి ఒక్కరు బాధ్యతగా నడుచుకోవాల్సిందేనని పోలీసులు హెచ్చరించారు. ఇతరులతో మాట్లాడేటప్పుడు గౌరవంగా వ్యవహరించాలని, నైతిక విలువలు పాటించాలని సూచించారు. అంతా ఒక్కటే అనే స్ఫూర్తిని చాటేలా మసలుకోవాలాన్నారు. ఇలాంటి దాడులను సహించబోమని హెచ్చరించారు.
తాజా వార్తలు
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!
- వాట్సాప్ వాయిస్ మెసేజ్‌లో బూతులు.. మహిళకు Dh30,000 జరిమానా..!!







