కువైట్ నుంచి విశాఖ చేరుకున్న 114 మంది ప్రయాణికులతో కూడిన విమానం

- June 11, 2020 , by Maagulf
కువైట్ నుంచి విశాఖ చేరుకున్న 114 మంది ప్రయాణికులతో కూడిన విమానం

విశాఖ:ఇతర దేశాల్లో ఉంటున్న వారిని రప్పించేందుకు కేంద్రం తీసుకున్న చొరవ సత్ఫలితాలను ఇస్తోంది.ఇప్పటివరకు ఇతర దేశాల నుంచి ఏపీకి రెండు విమానాల్లో విశాఖపట్నం తరలించగా, బుధవారం రాత్రి మరో విమానం కువైట్ నుంచి 114 మంది తెలుగు వాళ్లను తీసుకొచ్చింది. కువైట్ ఎయిర్ లైన్స్ (KU-1609) గత రాత్రి (KWT-VTZ) కువైట్ ఎయిర్లైన్స్ విమానంలో 9: 30 నిమిషాలకు 114 మంది తెలుగువారు విశాఖ చేరుకున్నారు. వీరితో పాటు వీరు తెచ్చుకున్న సామానులకు విశాఖ విమానాశ్రయం వద్ద సిబ్బంది శానిటైజ్ చేశారు.

వీరందరికీ స్క్రీనింగ్ టెస్ట్ ఇమ్మిగ్రేషన్కస్టమ్స్ చెకింగ్ చేయటానికి సుమారు ఒక గంట సమయం పట్టింది. కువైట్ నుండి విశాఖ చేరుకున్న ప్రయాణికులను విశాఖ పోర్టు సీతారామ కళ్యాణ మండపం తీసుకొని వెళ్లి కరోనా పరీక్షలు నిర్వహించి అనంతరం వారివారి జిల్లాలకు ప్రభుత్వ మరియు పెయిడ్ కోరం ట్రైన్ కు జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సులో తరలించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com