భారత్ నుంచి కువైట్ చేరుకుంటున్న వైద్య సిబ్బంది

- June 11, 2020 , by Maagulf
భారత్ నుంచి కువైట్ చేరుకుంటున్న వైద్య సిబ్బంది

కువైట్ సిటీ:లాక్ డౌన్ తో భారత్ లో చిక్కుకుపోయిన వైద్య సిబ్బంది, పారా మెడికల్ సిబ్బంది కువైట్ చేరుకుంటున్నారు. కువైట్ లోని వివిధ మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో విధులు నిర్వహిస్తున్న ఇండియన్ మెడికల్ స్టాఫ్ లాక్ డౌన్ కు ముందు సెలవుల్లో స్వదేశానికి వెళ్లారు. అయితే.. అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు అయిన నేపథ్యంలో వాళ్లంతా భారత్ లోనే చిక్కుకుపోయారు. ఈ సమయంలో ఇండియాలోనే వైద్య సేవలు అందించారు. ప్రస్తుతం పరిస్థితులు మెరుగుపడటంతో ఇక వైద్య సిబ్బందిని తీసుకొచ్చేందుకు కువైట్ ప్రభుత్వం ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసింది. కేరళలోని కొచ్చి నుంచి కువైట్ కు వెళ్లే ఈ ప్రత్యేక విమానాలు బుధవారం నుంచి ఆపరేషన్ ప్రారంభించాయి. నర్సులు, డాక్టర్లు, పలు విభాగాల్లో పని చేసే టెక్నికల్ సిబ్బంది గురువారం కువైట్ చేరుకున్నారు. రాబోయే రోజుల్లో మరికొందరు వైద్యసిబ్బంది కువైట్ రానున్నట్లు అధికారులు వెల్లడించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com