కువైట్:మళ్లీ రద్దీగా కువైట్ ఎయిర్ పోర్ట్..ఇండియాకు ప్రత్యేక విమానాలు షురూ

- June 11, 2020 , by Maagulf
కువైట్:మళ్లీ రద్దీగా కువైట్ ఎయిర్ పోర్ట్..ఇండియాకు ప్రత్యేక విమానాలు షురూ

కువైట్ సిటీ:లాక్ డౌన్ తర్వాత మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొనడంతో చాన్నాళ్ల తర్వాత కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం రద్దీగా మారింది. కువైట్ లోని ప్రవాసీయులను తీసుకెళ్లేందుకు పలు దేశాలు ప్రత్యేక విమాన సర్వీసులు నడుపుతుండటం..ఎయిర్ పోర్ట్ కు వచ్చి పోయే ప్రయాణికులతో సందడిగా మారింది. అయితే..వాణిజ్య విమానాలను కూడా ప్రారంభిస్తుండటంతో పాటించాల్సిన ప్రొటోకాల్ పై అధ్యయనం చేసేందుకు జాతీయ అసెంబ్లీ వ్యవహారాల మంత్రి ఏర్పాటు చేసిన కమిటీ ఇవాళ సమావేశం కాబోతోంది. విమాన సర్వీసుల పునరుద్ధరణ, కరోనా నేపథ్యంలో ప్రయాణికుల భద్రతపై కమిటీ చర్చించనుంది. అయితే..ఇప్పటికే ఎయిర్ పోర్ట్ ఆపరేషన్స్ కు సంబంధించి డీజీసీఏ మూడెంచెల విధానాన్ని అమలు చేస్తోంది. ఇక ఇవాళ సమావేశం కానున్న కమిటీ కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు అనుసరించాల్సిన ప్రొటోకాల్, చేపట్టాల్సిన విధానాలపై చర్చించనుంది.  ప్రయాణికులు విమానాశ్రయంలోకి ప్రవేశించి ఫ్లైట్ ఎక్కే వరకు ఆయా రంగాలు ఎలాంటి ప్రొటోకాల్ పాటించాలనేది ఖరారు చేయనుంది. ఇదిలాఉంటే..కువైట్ నుంచి ప్రవాసభారతీయులను స్వదేశానికి తరలిచేందుకు ప్రత్యేక విమాన సర్వీసులు నిన్నటి నుంచి ప్రారంభం అయ్యాయి. ఇక వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన ప్రవాసీయులను ఆగస్టులో కువైట్ తీసుకొచ్చేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com