కువైట్‌కి వచ్చే వలసదారులకు ఇవి తప్పనిసరి
- June 11, 2020
కువైట్ సిటీ: సుప్రీం పర్మనెంట్ కమిటీ ఫర్ ది అప్లికేషన్ ఆఫ్ హెల్త్ రెగ్యులేషన్స్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, ఇంటీరియర్ అండ్ ఫారిన్ ఎఫైర్స్ సంయుక్తంగా దేశంలోకి వచ్చే వలసదారులకు సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయడం జరిగింది. కువైట్‌కి వచ్చేవలసదారులు ఖచ్చితంగా పిసిఆర్ టెస్ట్ సర్టిఫికెట్ తీసుకురావాలనే నిబంధన విధించారు. దాంతోపాటుగా, కంపల్సరీ ఇన్‌స్టిట్యూషనల్ క్వారంటైన్‌కి సిద్ధపడాల్సి వుంటుంది. ఒకవేళ వలసదారుడు క్వారంటైన్‌కి సంబంధించి చెల్లించాల్సిన మొత్తం చెల్లించనట్లయితే, సంబంధిత స్పాన్సర్ నుంచి ఆ మొత్తాన్ని వసూలు చేస్తారు. నిబంధనలకు లోబడి వచ్చేవారికి, విమానాశ్రయం నుంచే సంబంధిత ఆసుపత్రులకు తరలించి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. కాగా, సంబంధిత సర్టిఫికెట్ లేని ప్రయాణీకుడ్ని అనుమతించిన విమానయాన సంస్థలపైనా చర్యలు తీసుకునేలా నిబంధనల్ని రూపొందిస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడిస్తున్నాయి.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్‌కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







