వైట్ వాష్ చేసిన నాయకుడిగా ధోని చరిత్ర సృష్టించాడు
- February 01, 2016
ఆస్ట్రేలియా గడ్డపై ఆస్టేలియాను క్లీన్ స్విప్ చేసిన భారత కెప్టెన్గా మహేంద్ర సింగ్ ధోని రికార్డు సృష్టించాడు. మూడు టీ20ల సిరీస్లో భాగంగా ఆదివారం సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో జరిగిన చివరి మ్యాచ్లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా వన్డే సిరీస్లో భారత్ ఘోర పరాజయం పాలైంది. దీంతో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. కెప్టెన్గా ధోని అవుట్ డేటెడ్ అయ్యాడని అతన్ని కొనసాగించడం జట్టు బలహీనతకు కారణమవుతోందని ఆసీస్ మాజీ కెప్టెన్ ఇయాన్ ఛాపెల్ విమర్శించాడు.కానీ పడిలేచిన కెరటంలా ఆస్టేలియా గడ్డపై కంగారూలను వైట్ వాష్ చేసిన నాయకుడిగా ధోని చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియా గడ్డపై పర్యాటక జట్టు ఆ దేశ జట్టుపై ఏ ఫార్మాట్లోనైనా వరుసగా మూడు మ్యాచ్లలో విజయం సాధించి టైటిల్ దక్కించుకున్న ఘటన 139 ఏళ్ల క్రితం జరిగిందట.తాజాగా ఆ రికార్డును బద్దలుకొడుతూ ధోనీ వరుసగా మూడు మ్యాచ్లలో కంగారూలపై విజయం సాధించి 139 ఏళ్ల నాటి రికార్డును తిరగరాశాడు. ఆస్టేలియా నిర్దేశించిన 198 పరగులు భారీ లక్ష్యాన్ని భారత్ మూడు రోహిత్, కోహ్లీ, రైనా, యూవీలు రాణించడంతో చివరి బంతికి భారత్ విజయం సాధించింది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









