కమల్,రజినికాంత్,శ్రీదేవి కాంబినేషన్ ఇప్పుడు డిజిటలైజ్డ్ వెర్షన్ రిలీజ్ కి సిద్దం
- June 12, 2020
భారత చిత్ర పరిశ్రమలో నటదిగ్గజాలు అయినటువంటి మహానటుడు కమల్ హాసన్, సూపర్ స్టార్ రజినీకాంత్, మరియు అందాల తార శ్రీదేవి నటీనటులుగా భారతీరాజా దర్శకత్వం వహించిన చిత్రం "పదినారు వయదినిలే". ఈ చిత్రం 4 రాష్ట్రీయ పురస్కారాలను సొంతం చేసుకుంది. ఉత్తమ నటుడిగా కమల్ హాసన్, ఉత్తమ దర్శకుడిగా భారతీరాజా, ఉత్తమ సంగీత దర్శకుడిగా ఇళయరాజా, ఉత్తమ నేపథ్య గాయనిగా ఎస్. జానకి జాతీయ పురస్కారాన్ని మరియు ఫిలిం ఫేర్ పురస్కారాన్ని అందుకోవడం విశేషం. ప్రస్తుతం ఈ చిత్రం అధునాతన డాల్బీ సౌండ్ పద్ధతుల్లో తెలుగు భాషలోకి అనువదించి, డిజిటలైజ్ చేసి,అన్ని పాటలను మళ్ళీ కొత్తగా పొందుపరచడం జరిగింది. ఈ చిత్రానికి తెలుగులో `నీకోసం నిరీక్షణ` టైటిల్ పెట్టారు.
ఈ చిత్రాన్ని సామాజిక మాధ్యమం ద్వారా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసిన అనంతరం మరో అయిదు భాషల్లో డబ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు సుప్రీమ్ ఆల్మైటీ క్రియేషన్స్ నిర్మాణ సంస్థ వెల్లడించింది.
ఈ సందర్భంగా నిర్మాత బామా రాజ్ కణ్ణు మాట్లాడుతూ - ``మధురమైన ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందని నమ్ముతున్నాను. ఇటీవల ఆదిత్య మ్యూజిక్ ద్వారా 5 పాటలను విడుదల చేశాం. వాటికి మంచి రెస్పాన్స్ వస్తోంది. సుమారు 30 నిముషాల నిడివి దృశ్యాలను తెలుగు ప్రేక్షకుల అభిరుచిగా తగ్గట్లుగా మార్పులు చేసి మీ ముందుకు తీసుకువస్తున్నాం`` అన్నారు.
ఈ చిత్రానికి సంగీతం : ఇళయరాజా,
నిర్మాత: బామా రాజ్ కణ్ణు,
దర్శకత్వం:భారతీరాజా.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







