అబుధాబి:మార్చి 1 తర్వాత వీసా రద్దైన ప్రవాసీయులు ఏం చెయ్యాలి?
- June 12, 2020
యూఏఈలో ఉంటున్న ప్రవాసీయుల రెసిడెన్సీ వీసా గడువు మార్చి 1తో ముగిస్తే వాళ్లు ఏం చెయ్యాలి? కరోనా వైరస్ నేపథ్యంలో వీసా కాలపరిమితిని ఈ ఏడాది డిసెంబర్ చివరి వరకు పొడగించిన విషయం తెలిసిందే. మరి వీసా రద్దు అయిన వాళ్ల పరిస్థితి ఏంటి? వారికి ప్రభుత్వం ప్రకటించిన గడువు మినహాయింపు వర్తిస్తుందా? ఈ సందేహాలకు యూఏఈ పౌర గుర్తింపు అధికారుల సమాఖ్య పూర్తి స్పష్టత ఇచ్చింది. మార్చి ఒకటితో కాలపరిమితి ముగిసిన వీసాల గడువు డిసెంబర్ చివరి వరకు పొడగించిన విషయం వాస్తవమే అయినా..వీసా రద్దు అయిన వారికి మాత్రం ఈ మినహాయింపు వర్తించదని అధికారులు స్పష్టం చేశారు. కాలపరిమితి ముగిసిన వీసాదారులు, రద్దు అయిన వీసాదారులను వేర్వేరుగా పరిగణించనున్నట్లు వెల్లడించింది. మార్చి 1తో వీసా రద్దు అయిన వాళ్లు వెంటనే తమ వీసా స్టేటస్ ను మార్చుకోవాలని అధికారులు సూచించారు. కొత్త వర్క్ వీసా తీసుకోవటంగానీ లేదంటే విజిట్ వీసా తీసుకోవటం ద్వారా ప్రస్తుతానికి సమస్య నుంచి గట్టెక్కొచ్చని తెలిపింది. లేదంటే వీసా రద్దు అయిన నాటి నుంచి గ్రేస్ పిరియడ్ ముగిసే లోపల దేశం విడిచి వెళ్లాల్సిందేనని ఆదేశించింది. లేదంటే ఎన్ని రోజులు ఎక్కువగా దేశంలో ఉంటే దాన్ని బట్టి జరిమానా చెల్లించాల్సి ఉంటుందని అధికారులు స్పష్టతనిచ్చారు. మరిన్ని వివరాలకు ఈ నెంబర్ 8005111 కు కాల్ చెయ్యగలరు లేదా అమీర్ కేంద్రాలకు వెళ్లి మీ వీసా స్టేటస్ చెక్ చేసుకోగలరు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







