వెయిటింగ్‌లో వలసదారులకు 'అదనపు రుసుము'
- February 01, 2016
వలసదారులకు అందించే శానిటరీ సర్వీసులకు సంబంధించి అదనపు రుసుము విధించేలా ఎంపీలు చేసిన ప్రతిపాదనలు ఇంకా చర్చల దశలోనే ఉన్నట్లు మినిస్టర్ ఎస్సామ్ ఖలాఫ్ చెప్పారు. కౌన్సిల్ ఆఫ్ రిప్రెజెంటేటివ్స్‌కు ఈ వ్యవహారాన్ని రిఫర్ చేశామనీ, ప్రభుత్వం కౌన్సిల్ వ్యూస్ కోసం ఎదురుచూస్తోందని ఆయన అన్నారు. శానిటేషన్ మరియు సర్ఫేస్ డిశ్చార్జ్ చట్టానికి సవరణలు చేసేందుకు చర్చిస్తున్నామనీ, దీనికి సంబంధించి కొంత మొత్తాన్ని ప్రభుత్వం సేకరించేలా ఆలోచనలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. ప్రస్తుతానికి ఈ సేవలన్నీ ఉచితంగానే లభిస్తున్నాయి. ఎలాంటి చర్యలు తీసుకున్నా అవి బహ్రెయిన్ పౌరులకు నష్టం కలిగించవని మినిస్టర్ వెల్లడించారు. గడచిన పదిహేనేళ్ళలో 300 బహ్రెయినీ దినార్స్ సీవేజ్ సైట్స్ మరియు ప్రాజెక్టులపై ఖర్చు చేశామనీ, రానున్న 14 ఏళ్ళలో 75 మిలియన్ బహ్రెయినీ దినార్స్ ఖర్చు చేయనున్నామని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







