ఖతార్ మోటర్ షోలో 25,000 మంది అభిమానులు
- February 01, 2016
ఆటోమేటివ్ అభిమానులు దోహా ఎగ్జిబిషన్ మరియు కాన్ఫరెన్స్ సెంటర్ (డిఇసిసి)ని సందర్శించారు. ఖతార్ టూరిజం నిర్వహించిన ఖతార్ మోటర్ షోకి అభిమానుల తాకిడి గణనీయంగా ఉంది. ఖతార్ మోటర్ షో వెబ్‌సైట్‌లో ముందస్తుగా రిజిస్టర్ చేసుకుంటే, ఈజీగా యాక్సెస్ లభిస్తుంది. 2015తో పోల్చితే 18 శాతం అదనంగా కొత్త బ్రాండ్స్ డిఇసిసిలో కొలువుదీరాయి. ఆడి, బిఎండబ్ల్యు, బోష్, కాడిలాక్, క్యాస్ట్రాల్, కాంటినెంటల్, డుకాటీ, ఫెరారీ, ఫోర్డ్, జాగ్వార్, ల్యాండ్ రోవర్, మసారెటి, మెర్సిడెస్ బెంజ్, పోర్షే, రోల్స్ రాయ్స్, విడబ్ల్యు వంటి ఎన్నో ప్రముఖ బ్రాండ్స్ ఎగ్జిబిషన్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. డైలీ కాంపిటీషన్స్, బహుమతులు వంటివి ఆహూతుల్ని అలరిస్తున్నాయి. ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ వంటి మాధ్యమాల ద్వారా కాంపిటీషన్స్‌లో పాల్గొని, బహుమతులు గెలుచుకునే అవకాశాన్ని నిర్వాహకులు కల్పించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







