WhatsApp: గుడ్ న్యూస్... ఒకే వాట్సప్ అకౌంట్ నాలుగు డివైజ్‌లలో వాడుకోవచ్చు
- June 15, 2020
వాట్సప్ యూజర్లకు శుభవార్త. త్వరలో మీ వాట్సప్ అకౌంట్‌ను నాలుగు డివైజ్‌లలో వాడుకోవచ్చు. ప్రస్తుతం ఈ సదుపాయం లేదు. స్మార్ట్‌ఫోన్‌తో పాటు డెస్క్‌టాప్‌లో మాత్రమే వాట్సప్ ఉపయోగించుకోవచ్చు. కానీ త్వరలో మల్టీపుల్ డివైజ్‌లలో వాట్సప్ ఉపయోగించుకునేలా సరికొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. వాట్సప్‌కు సంబంధించిన సమాచారాన్ని ప్రపంచానికి తెలిపే WABetaInfo ప్రకారం త్వరలోనే ఈ ఫీచర్ రిలీజ్ కానుంది. ఈ అప్‌డేట్ వచ్చిన తర్వాత ఒకే అకౌంట్‌ని నాలుగు డివైజ్‌లలో ఒకేసారి వాడుకోవచ్చు. ఎక్కువ డివైజ్‌లు ఉపయోగించేవారికి ఈ ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది. కొందరి చేతుల్లో మనం రెండు స్మార్ట్‌ఫోన్స్ చూస్తుంటాం. రెండు ఫోన్లలో ఒకే వాట్సప్ అకౌంట్ వాడుకోవచ్చు. అంతేకాదు... ట్యాబ్లెట్ వాడుతున్నా అదే అకౌంట్‌ని ట్యాబ్‌లో లాగిన్ చేయొచ్చు. ఇలా వేర్వేరు డివైజ్‌లలోని డేటా వైఫై కనెక్టివిటీ ద్వారా సింక్ అవుతుంది.
Yes, it's the ability to use your WhatsApp account from 4 devices at the same time.
— WABetaInfo (@WABetaInfo) June 12, 2020
Under development, but it's great!
📱📱📱📱 pic.twitter.com/JYvtMahrag
గతేడాది నుంచి వాట్సప్ యూజర్లను ఊరిస్తున్న ఫీచర్ ఇది. ఐఓఎస్ బీటా వర్షన్‌లో కనిపించింది. అప్పట్నుంచీ ఈ ఫీచర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని వాట్సప్ యూజర్లు ఎదురుచూస్తున్నారు. ఇక వాట్సప్ తేదీతో సెర్చ్ చేసే ఫీచర్‌ని కూడా పరీక్షిస్తోంది. ఈ ఫీచర్ వస్తే మీరు ఏ తేదీకి సంబంధించిన ఛాటింగ్ వివరాలు చూడాలనుకుంటే ఆ డేట్ సెలెక్ట్ చేస్తే చాలు. ఆ రోజు మెసేజెస్ మాత్రమే కనిపిస్తాయి.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







