ముంబైలో తెలంగాణ వలసకార్మికుల సమావేశం
- February 01, 2016
ముంబైలోని ఆంధ్ర మహాసభ హాల్ నందు ఆదివారం (31 జనవరి 2016) తెలంగాణ వలసకార్మికుల సేవాసంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 'గల్ఫ్ తెలంగాణ' అధికార ప్రతినిధి పట్కూరి బసంత్ రెడ్డి మాట్లాడుతూ దశాబ్దాల క్రితం మహారాష్ట్ర కు బతుకుదెరువుకోసం వచ్చిన తెలంగాణవారు స్థానిక మరాటీ ప్రజలతో కలిసి మెలిసి ఉంటున్నారని, మహారాష్ట్ర సంస్కృతితో మమేకమై, తమ తెలంగాణ భాషా, సంస్కృతులను కాపాడుకుంటున్నారని అన్నారు. మహారాష్ట్రలో ఉన్న తెలంగాణ వలసకార్మికుల సమస్యల పరిష్కారం, సంక్షేమం కోసం తాను తెలంగాణ ప్రభుత్వ పెద్దలను కలుస్తానని అన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు బసంత్ రెడ్డిని 'ముంబై-తెలంగాణ' వలసకార్మికుల కోఆర్దినేటర్ గా నియమించి సన్మానించారు. ఈ సమావేశంలో నల్ల రాధా కృష్ణ, మచ్చ ప్రభాకర్, రవీందర్, బత్తుల లింగం, 'తెలంగాణ జాగృతి' మహారాష్ట్ర విభాగం కన్వీనర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ విషయాన్ని 'గల్ఫ్ తెలంగాణ' అధికార ప్రతినిధి పట్కూరి బసంత్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







