ఆస్కార్ 2021 అవార్డు వేడుక వాయిదా..
- June 16, 2020
ఆస్కార్ 2021 అవార్డు వేడుక వాయిదా పడింది. కరోనావైరస్ మహమ్మారి నేపథ్యంలో 8 వారాల పాటు వాయిదా వేసింది. ఈ మేరకు అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ వాయిదా నిర్ణయాన్ని ప్రకటించింది. దీంతో చరిత్రలో నాలుగోసారి ఆస్కార్ వాయిదా పడినట్లయింది. ఆస్కార్ 2021 అవార్డుల కోసం మొదట 28 ఫిబ్రవరి 2021గా నిర్ణయించారు. అయితే కరోనా నేపథ్యంలో ఇది ఇప్పుడు ఏప్రిల్ 25న జరుగుతుందని ప్రకటించింది.
అంతేకాదు ఆస్కార్ 2021 అవార్డుల వేడుకకోసం నామినేషన్ తేదీని కూడా డిసెంబర్ 31 నుండి ఫిబ్రవరి 28 వరకు పొడిగించాలని అకాడమీ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ నిర్ణయించింది. కాగా ఆస్కార్ అవార్డుల వేడుక మొదటిసారి లాస్ ఏంజిల్స్‌లో వచ్సిన వరదల కారణంగా వాయిదా పడ్డాయి. ఆ తరువాత 1968 లో, డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ హత్య నేపథ్యంలో రెండు రోజులపాటు ఆలశ్యం అయ్యాయి. ఇక 1981లో24 గంటలపాటు నిలిపివేశారు.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







