‘ది నర్సింగ్‌ నౌ’ క్యాంపెయిన్‌ ప్రారంభించిన ఒమన్‌

- June 16, 2020 , by Maagulf
‘ది నర్సింగ్‌ నౌ’ క్యాంపెయిన్‌ ప్రారంభించిన ఒమన్‌

ఒమన్‌:మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌, ‘ది నర్సింగ్‌ నౌ’ క్యాంపెయిన్‌ని ప్రారంభించింది. వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌, ఇంటర్నేషనల్‌ నర్సింగ్‌ కౌన్సిల్‌తో కలిసి ఈ అంతర్జాతీయ స్థాయి క్యాంపెయిన్‌ని ప్రకటించిన విషయం విదితమే. మినిస్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ డాక్టర్‌ అహ్మద్‌ బిన్‌ మొహమ్మద్‌ అల్‌ సయీది ఈ కార్యక్రమాన్ని ఒమన్‌లో ప్రారంభించారు. నర్సింగ్‌ రంగంలో విప్లవాత్మకమైన మార్పులకు ఈ క్యాంపెయిన్‌ శ్రీకారం చుడుతుందని మినిస్టర్‌ పేర్కొన్నారు. హెల్త్‌ సెక్టార్స్‌ అలాగే పబ్లిక్‌ మరియు ప్రైవేట్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌కి చెందిన నర్సింగ్‌ గ్రూప్స్‌ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడంలో కీలక పాత్ర పోషించనున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com