మనీ లాండరింగ్‌: సౌదీలు మరియు వలసదారులకు జైలు

- June 18, 2020 , by Maagulf
మనీ లాండరింగ్‌: సౌదీలు మరియు వలసదారులకు జైలు

రియాద్:సౌదీ న్యాయస్థానం 28 మందికి జైలు శిక్ష విధించింది. మనీ లాండరింగ్‌కి పాల్పడుతున్నారన్న అభియోగాల మేరకు ఈ శిక్షను న్యాయస్థానం ఖరారు చేసింది. సౌదీలు అలాగే వలసదారులు ఈ కేసులో నిందితులుగా వున్నారు. మొత్తం 16 బిలియన్‌ సౌదీ రియాల్స్‌ని ఈ గ్యాంగ్‌ నుంచి సంబంధిత అథారిటీస్‌ స్వాధీనం చేసుకోవడం జరిగింది. జైలు శిక్ష ముగిశాక సౌదీలు విదేశాలకు వెళ్ళకూడదనీ, జైలు శిక్ష ముగించుకున్న వలసదారుల్ని వెంటనే డిపోర్ట్‌ చేయాలనీ న్యాయస్థానం ఆదేశించింది. మనీ లాండరింగ్‌ చట్టం ప్రకారం నిందితులకు మిలియన్‌ సౌదీ రియాల్స్‌ వరకు జరీమానాతోపాటు 15 ఏళ్ళ జైలు శిక్ష విధించే అవకాశం వుంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com