ఐక్యరాజ్యసమితి లో భారత్ విజయం
- June 18, 2020
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఎన్నికల్లో భారత్ విజయం సాధించడంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ హర్షం వ్యక్తం చేశారు. భద్రతా మండలిలో భారత్‌కు మద్దతు తెలిపిన యావత్ ప్రపంచదేశాలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచశాంతి, సమానత్వం నెలకొల్పడంలో సభ్యదేశాలతో కలిసి భారత్ పనిచేస్తుందని ప్రధాని ట్విటర్లో పేర్కొన్నారు. 193 సభ్యదేశాలు కలిగిన యూఎన్ఎస్స్సీలో 2021-2022 సంవత్సరాలకుగాను భారత్ మరోసారి ఎన్నికైన విషయం తెలిసిందే. మొత్తం 192ఓట్లు పోలవ్వగా భారత్‌కు 184దేశాల మద్దతు లభించింది.
ఐక్యరాజ్య సమితి శాశ్వత సభ్యదేశాలుగా కేవలం అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, రష్యా దేశాలు మాత్రమే ఉన్నాయి. అయితే, శాశ్వత సభ్యదేశాలు కాని సభ్యుల కోసం ప్రతిరెండు సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. దీనిలోభాగంగా బుధవారం జరిగిన ఎన్నికల్లో భారత్ భారీ మద్దతు సాధించింది. భారత్‌తోపాటు ఐర్లాండ్, మెక్సికో, నార్వే దేశాలు కూడా ఈ ఎన్నికల్లో గెలుపొందాయి. కెనడా మాత్రం ఓటమి పాలయ్యింది.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్‌కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







