చైనా సాయం కోరిన ట్రంప్
- June 18, 2020
అమెరికా అధ్యక్షుడు డోనాల్ట్ ట్రంప్‌పై.. ఆ దేశ మాజీ జాతీయ భద్రతా సలహాదారుడు బోల్టన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించేందుకు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ సహాయాన్ని ట్రంప్ కోరినట్లు ఆయన ఆరోపించారు. ఈ ఏడాది నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ పోటీ చేయనున్నారు. రెండవ సారి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు జిన్ పింగ్ సహాయాన్ని ట్రంప్ కోరినట్లు బోల్టన్ ఆరోపించారు. కొత్తగా రాసిన ఓ పుస్తకంలో బోల్టన్ ఈ విషయాన్ని వెల్లడించారు. అమెరికా రైతులకు చెందిన వ్యవసాయ ఉత్పత్తులను చైనా కొనుగోలు చేయాలని ట్రంప్ భావిస్తున్నట్లు బోల్టన్ తన పుస్తకంలో తెలిపారు. శ్వేతసౌధాన్ని ఎలా నడుపాలన్న దానిపై ట్రంప్‌కు ఎటువంటి క్లారిటీ లేదన్నారు.
బోల్టన్ రాసిన పుస్తకాన్ని రిలీజ్ చేయకుండా ఉండేందుకు ట్రంప్ ప్రభుత్వం అడ్డుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ద రూమ్ వేర్ ఇట్ హ్యాపెన్డ్ అనే 577 పేజీల పుస్తకాన్ని బోల్టన్ రాశారు. జూన్ 23వ తేదీ నుంచి ఆ పుస్తకం మార్కెట్‌లో అందుబాటులో ఉంటుంది. పుస్తకం రిలీజ్‌ను ఆపాలని ట్రంప్ సర్కార్‌కు చెందిన న్యాయశాఖ.. ఓ జడ్జి నుంచి ఆదేశాలు కోరినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా వేలాది మందికి ఈ పుస్తకం చేరిందని, జడ్జి ఆదేశాలతో తమకు ఎటువంటి నష్టం ఉండదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
అమెరికా ప్రభుత్వ జాతీయ సలహాదారుడిగా బోల్టన్.. ఏప్రిల్ 2018 నుంచి ఆ ఏడాది సెప్టెంబర్ వరకు పనిచేశారు. ఆ తర్వాత ఆయన రాజీనామా చేశారు. ట్రంప్ విధానాలను వ్యతిరేకించిన బోల్టన్.. శ్వేతసౌధాన్ని విడిచి వెళ్లారు. కానీ బోల్టన్‌ను తానే సాగనంపినట్లు ట్రంప్ చెబుతున్నారు. బోల్టన్ చట్టాన్ని ఉల్లంఘించారని, అందుకే ఆయన్ను తొలగించినట్లు ట్రంప్ తెలిపారు.
తాజా వార్తలు
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!
- ఖతార్‌లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్‌లో భారీ వర్షాలు..!!
- ఇరాన్‌పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్‌కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి







