మెసేజింగ్ సర్వీస్ వాట్సాప్ కొత్త మైలురాయిని చేరుకుంది
- February 01, 2016
ప్రముఖ మెసేజింగ్ సర్వీస్ వాట్సాప్ కొత్త మైలురాయిని చేరుకుంది. వాట్సాప్ యూజర్ల సంఖ్య 100 కోట్లకు చేరుకుంది. ఫేస్ బుక్ సీఈవో మార్క్ జూకర్ బర్గ్ ఈ విషయాన్ని ప్రకటించారు. వాట్సాప్ సహ వ్యవస్థాపకులు జాన్ కౌమ్, బ్రియాన్ ఆక్టన్ లను అభినందించారు. 2014లో ఫేస్ బుక్ యాజమాన్యం వాట్సాప్ ను సొంతం చేసుకున్నాక యూజర్లు గణనీయంగా పెరిగారు. ఈ రెండేళ్లలోపే వాట్సాప్ యూజర్ల సంఖ్య రెట్టింపు కావడం విశేషం.'ఫేస్ బుక్ లో చేరాక వాట్సాప్ యూజర్లు రెట్టింపుకంటే ఎక్కువయ్యారు. వాట్సాప్ సేవలను పూర్తిగా ఉచితంగా అందిస్తున్నాం. ప్రపంచ వ్యాప్తంగా మరింతమందికి సేవలందించేందుకు కృషి చేస్తున్నాం. మా తర్వాతి లక్ష్యం ఈ సర్వీసును వ్యాపారంతో అనుసంధానిస్తాం' అని జూకర్ బర్గ్ ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు.'ప్రతినెలా ప్రపంచంలో ఏడుగురిలో ఒకరు వాట్సాప్ ను ఉపయోగిస్తున్నారు. ప్రేమికులు, స్నేహితులు, కుటుంబ సభ్యులతో సమాచారం పంచుకుంటున్నారు. జాతీయ విపత్తులు, ఆరోగ్య సమస్యలు మొదలు శుభకార్యాలు, వ్యాపారాల వరకు సమాచారాన్ని షేర్ చేసుకుంటున్నారు' అని వాట్సాప్ టీమ్ పేర్కొంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







