మన్మోహన్ సింగ్,రాహుల్ గాంధీ నేడు అనంతపురంకి రాక..
- February 01, 2016
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మంగళవారం అనంతపురం జిల్లా నార్పల మండలం బండ్లపల్లికి రానున్నారు. ఉపాధి హామీ పథకాన్ని బండ్లపల్లిలో ప్రారంభించి మంగళవారానికి పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా పీసీసీ ఆధ్వర్యంలో అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వీరు పాల్గొంటారు. కాగా, రాహుల్‌గాంధీ బెంగళూరు నుంచి మంగళవారం మధ్యాహ్నం 1.30 గంటలకు బండ్లపల్లి చేరుకొని సర్పంచ్‌లు, ఉపాధి హామీ కూలీలతో సమావేశమవుతారు.ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఏర్పాటు చేసిన పైలాన్‌ను ఆవిష్కరించి.. బహిరంగ సభలో పాల్గొంటారు.ఆయన తిరిగి 4.30 గం.కు బెంగళూరు వెళ్తారని పార్టీ నేతలు తెలిపారు. ఉపాధి హామీ చట్టం అమలయ్యేలా ప్రభుత్వంపై పోరాటం చేస్తామంటూ కూలీలకు భరోసా కల్పించేందుకు రాహుల్, మన్మోహన్‌తో పాటు జాతీయనేతలు బండ్లపల్లికి వస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు రఘువీరా వెల్లడించారు. కాగా, ఈ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ నేతలు రాష్ట్రంతో పాటు పొరుగున ఉన్న కర్నాటక నుంచి కూడా జన సమీకరణ చేస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







