బాలయ్య బావ కోసం యాగం
- February 01, 2016
పాలనలో చిక్కులు, చికాకులు ఎదుర్కొంటున్న తన వియ్యంకుడు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సేఫ్టీ కోసం యాగం, హోం చేయాలని సినీనటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ నిర్ణయించారట. దీనిపై ఇప్పటికే ఆయన జ్యోతిష్కులతో సంప్రదింపులు జరిపినట్టు తెలిసింది. శుక్రవారం రాత్రి రాహువు.. గురు గ్రహంతో కలిసి సింహలగ్నంలో ప్రవేశించాడని, అది పాలకులకు శుభప్రదం కాదని జ్యోతిష్కులు చెప్పారని తెలిసింది. పైగా గ్రహాల సంచార ఫలితంగా అమరావతి కొత్త రాజధాని నిర్మాణంలో జాప్యం జరగవచ్చునని కూడా అభిప్రాయపడ్డారట.ఈ నేపథ్యంలో జ్యోతిష్యం మీద ఎంతో నమ్మకం వున్న బాలయ్య, ముఖ్యంగా.. చంద్రబాబుకు శుభం జరగాలని కోరుతూ ప్రత్యేక హోమాలు నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.ఈ హోమ, యాగాలకు పెద్దగా పబ్లిసిటీ ఇవ్వరాదని ఆయన సూచించినట్టు చెబుతున్నారు. గురు-రాహువుల గ్రహాల కలయిక దేశానికి, రాష్ర్టానికీ మంచిదికాదని రాష్ర్ట ప్రభుత్వ ఆగమ సలహాదారు, కాంచీపీఠం ఆస్థాన జ్యోతిష్కుడు ఎల్ సుబ్రమణ్యం సిద్ధాంతి అంటున్నారు. ఈ గ్రహాల వల్ల పాలకులకు మంచి జరగదని, రాజకీయ అనిశ్చితి ఏర్పడవచ్చన్నది ఆయన వివరణ. మంచి జరగాలంటే రాజశ్యామల సంపూతిత పాశుపత మహాయాగం నిర్వహించాలని ఆయన సూచించినట్టు తెలుస్తోంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







