జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది..
- February 02, 2016
జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 150 డివిజన్లకు ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. 150 డివిజన్లకు 1,333 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఎన్నికల కోసం 7,802 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. 72లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్థన్‌రెడ్డి తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు. * జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి కుందన్‌బాగ్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా కుందన్‌బాగ్‌లో పోలింగ్ ఏర్పాట్లను జనార్దన్‌రెడ్డి పరిశీలించారు. * రామ్‌నగర్‌లో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ కుటుంబ సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. * మైలార్దేవరపల్లి డివిజన్లోని లక్ష్మీగూడ, కొండాపూర్ డివిజన్లోని 33,35,38 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించడంతో 15 నిమిషాలు ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. * హైదరాబాద్ సీపీ మహేందర్‌రెడ్డి కుందన్‌బాగ్ చిన్మయ విద్యాలయంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్‌జెట్‌లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్‌లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









