ఓ గ్లాసు రెడ్ వైన్ తప్పనిసరి అంటున్న అనసూయ
- June 20, 2020
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే టాలీవుడ్ స్టార్ యాంకర్ అనసూయ ఎప్పటికప్పుడు ఎదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ముఖ్యంగా ఫైర్‌బ్రాండ్ ఇమేజ్ ఉన్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో బోల్డ్ కామెంట్స్ చేస్తుంటుంది. అదే సమయంలో తన మీద వచ్చే ట్రోలింగ్స్ విషయంలోనూ అదే స్థాయిలో స్పందిస్తుంటుంది అనసూయ. సోషల్ మీడియాలో ఫుల్ ఫాంలో ఉండే ఈ బ్యూటీ గ్లామర్‌కు కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. జబర్థస్త్ వేదిక మీద అందాలు ఆరబోసి పాపులర్ అయిన ఈ బ్యూటీ సినిమాల్లోనూ సత్తా చాటింది.
తాజాగా ఈ బ్యూటీ తన గ్లామర్ సీక్రెట్ ఏంటో బయట పెట్టింది. `నేను రోజు గ్లాస్ రెడ్ వైన్.. కొన్ని డ్రై ఫ్రూట్స్ తింటాను. అవే నా గ్లామర్ సీక్రెట్ అని నేను అనుకుంటున్నాను` అంటూ రివీల్ చేసింది అనసూయ. అంతేకాదు నేను వైన్ తప్ప ఇంకేమీ తీసుకోను అని చెప్పింది అనసూయ. గ్లామర్ సీక్రెట్ కాబట్టి వైన్ ఒక్కటే అలవాటు అన్న అనసూయ, అది గుండెకు కూడా చాలా మంచిది అని చెప్పింది.
వైన్ ఆకలిని కూడా తగ్గిస్తుంది. ఆకలిగా ఉంటే నిద్రపట్టదు. కాబట్టి రాత్రి గ్లాసు రెడ్ వైన్ తాగుతాను అని చెప్పింది. ఉపవాసాలు ఉంటారా..? అన్న ప్రశ్నకు సమాధానంగా అవంటే నాకు అస్సలు గిట్టదు. అందుకే ఫుల్ మీల్స్‌కు బదులుగా గ్లాస్ రెడ్ వైన్ డ్రై ఫ్రూట్స్ తీసుకుంటానని చెప్పింది ఈ హాట్ యాంకర్. ప్రస్తుతం టీవీ షోస్‌తో పాటు సినిమాలతోనూ బిజీగా ఉన్న ఈ బ్యూటీ కృష్ణవంశీ దర్శకత్వంలో కొత్త సినిమా చేసేందుకు రెడీ అవుతోంది.
తాజా వార్తలు
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







