రూ.50వేల కోట్లతో వలస కార్మికులకు ఉపాధి పథకం..
- June 20, 2020
న్యూ ఢిల్లీ:లాక్డౌన్తో ఎన్నో కష్టాలు పడుతున్న వలస కార్మికుల కోసం కేంద్రం ప్రత్యేక ఉపాధి పథకాన్ని తీసుకొచ్చింది. రూ.50వేల కోట్లతో వలస కార్మికులకు స్వస్థలాల్లోనే ఉపాధి కల్పించేందుకు గరీబ్ కల్యాణ్ రోజ్గార్ అభియాన్ పథకాన్ని ప్రారంభించారు. శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మొదట బీహార్లోని ఖగారియా జిల్లాలో ఈ పథకాన్ని ప్రారంభించారు ప్రధాని మోదీ. ఈ కార్యక్రమంలో గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, బీహార్ సీఎం నితీష్ కుమార్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోత్, ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, ఒడిశా సీఎం ప్రతినిధి పాల్గొన్నారు.
దేశవ్యాప్తంగా 116 జిల్లాల్లో వలస కార్మికులకు 125 రోజుల పాటు ఉపాధి కల్పించనున్నారు. వలస కార్మికులు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో మాత్రమే ఈ పథకం అమలు చేస్తున్నారు. బీహార్లో అత్యధికంగా 32 జిల్లాల్లో గరీబ్ కల్యాణ్ రోజ్గార్ యోజన పథకం వర్తిస్తుంది. ఇక యూపీలో 31, మధ్యప్రదేశ్లో 24, రాజస్థాన్లో 22 జిల్లాలు ఉన్నాయి. పథకం ప్రారంభమైనందున అక్కడి వలస కార్మికులకు పని కల్పించనున్నారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు