దుబాయ్ రోడ్లపై పెరిగిన స్పీడ్ లిమిట్
- February 02, 2016
రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ, దుబాయ్ పోలీస్ జనరల్ హెడ్ క్వార్టర్స్ సహాయంతో ఎమ్ సుకెమ్ రోడ్‌పై వేగ నియంత్రణను పెంచింది. అల్ కుద్రా రోడ్ సెక్టార్ వరకు ఈ పెంపుదల అమల్లోకి వస్తుంది. ఇప్పటిదాకా ఈ రోడ్‌పై వేగ నియంత్రణ గంటకు 80 కిలోమీటర్ల దాకా ఉంది. దాన్ని గంటకు 90 కిలోమీటర్ల వేగం వరకు పెంచారు. అల్ కుద్రా రోడ్‌లోని మిగతా ప్రాంతానికి అంటే ఎమిరేట్స్ రోడ్ నుంచి సేహ్ అసలామార్ రౌండ్ ఎబౌట్ వరకు 100 కిలోమీటర్ల వేగం గంటకు పెంచారు. ఇది ఇప్పటివరకు గంటకు 90 కిలోమీటర్ల వేగంగా ఉంది. ఫిబ్రవరి 6 నుంచి వేగం పెంపు అమల్లోకి వస్తుంది. రోడ్లపై వేగ నియంత్రణ కోసం అధునాతన రాడార్లను అమర్చామనీ, అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దిన రోడ్లు వాహనదారులకు మంచి అనుభూతినిస్తాయనీ, సేఫ్ జర్నీని కూడా అందిస్తాయని అధికారికవ వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







