అద్దె వివాదం: 16 కుటుంబాల ఇబ్బందులు
- February 02, 2016
అజ్మన్లో ఓ అపార్మెంట్ ఓనర్, అద్దెకు ఉంటోన్నవారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న ఘటన వెలుగు చూసింది. ఐదు అంతస్తులు గల ఆ భవనంలో మొత్తం 16 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. అయితే సౌకర్యాల పేరుతో అదనంగా అద్దెలను పెంచేందుకు ప్రయత్నిస్తున్న ఓనర్, దాన్ని వ్యతిరేకిస్తున్న కుటుంబాలపై కక్ష సాధింపు చర్యలకు పూనుకున్నాడు. అపార్ట్మెంట్లో లిఫ్ట్ వాడకుండా చేయడం, కరెంటు, నీటి సరఫరా నిలిపివేయడంతో బాధిత కుటుంబాలు రెంట్ డిస్ప్యూట్ కమిటీని ఆశ్రయించింది. నాలుగో అంతస్థులో ఉంటున్న ఓ కుటుంబం, రోజూ తమ పిల్లల్ని స్కూలు నుంచి ఇంటికి, ఇంటి నుంచి స్కూలుకు తీసుకువెళ్ళే సమయంలో అంత ఎత్తు నుంచి మెట్ల మార్గంలో దిగడం ఇబ్బందిగా ఉందని ఆవేదన వ్యక్తం చేసింది. అలాగే, నీటి సమస్య కరెంటు సమస్యతో తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నామని ఇంకో కుటుంబం చెప్పింది. పోలీస్ స్టేషన్లో కూడా ఓనర్ వేధింపులపై ఫిర్యాదు చేశారు అద్దెకు ఉంటోన్నవారు. చట్ట ప్రకారం ఓనర్ చర్యలు సమర్థనీయం కాదని వారంటున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







