పది గ్రాముల పసిడి ధర రూ.27,300కి చేరింది..
- February 02, 2016
పసిడి ధర మూడు నెలల గరిష్ఠానికి చేరింది. రూ.115 పెరగడంతో 99.9శాతం స్వచ్ఛత గల పది గ్రాముల పసిడి ధర రూ.27,300కి చేరింది. పెళ్లిళ్ల సీజన్ ముందుండటం, ప్రపంచ మార్కెట్ల ప్రభావంతో దీని ధర పెరిగిందని బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా సింగపూర్ బులియన్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 0.2శాతం పెరిగి 1,130.50 అమెరికన్ డాలర్లకు చేరింది. గత ఏడాది నవంబరు 3 తర్వాత అక్కడ ఇదే అధిక ధర కావడం గమనార్హం. అయితే దేశీయ బులియన్ మార్కెట్లో వెండి ధర మాత్రం స్వల్పంగా తగ్గింది. రూ.
60 తగ్గడంతో కేజీ వెండి ధర రూ.34,870కి చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారులు కొనుగోళ్లు చేయకపోవడంతో దీని ధర తగ్గిందని బులియన్ మార్కెట్ వర్గాలు తెలపాయి.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్‌లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









