చంద్రబాబు సందర్శకులకు ఆర్ధిక సాయం..
- February 02, 2016
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యాలయానికి మంగళవారం సందర్శకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వివిధ జిల్లాల నుంచి చంద్రబాబును కలవడానికి వచ్చిన వారితో ప్రాగంణం కిక్కిరిసిపోయింది. విద్య, ఆరోగ్య, ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి సమస్యలను చంద్రబాబు స్వయంగా అడిగి తెలుసుకున్నారు. వారికి ఆర్థికం సాయం అందించారు.► విజయవాడకు చెందిన నాగుల్‌బికు కిడ్నీ చికిత్స కోసం లక్ష రూపాయల సహాయం ప్రకటించారు. ► గుంటూరు జిల్లాకు చెందిన రమాదేవి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుండడంతో ఆమె వైద్యానికి రూ. 2 లక్షలు మంజూరు చేశారు. ► కృష్ణాజిల్లా జగ్గయ్యపేటకు చెందిన వెంకటరావమ్మ రైలు ప్రమాదంలో గాయపడి చికిత్సపొందుతూ ఆర్ధికంగా దెబ్బతిన్నారు.ఆమెకు రూ. లక్ష రూపాయలు మంజూరు చేస్తూ ఆదేశాలిచ్చారు.పలువురికి ఉన్నత చదువులు, వివాహానికి, వైద్య ఖర్చులకు, ఆర్ధికంగా ఎదుగుదలకు చంద్రబాబు సాయం అందించారు. ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని వారికి ఆయన భరోసా నిచ్చారు. దీనిపై సందర్శకులు హర్షం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







