మస్కట్:విమాన ప్రయాణికులకు 4 గంటల ముందే ఎయిర్ పోర్ట్ చేరుకోవాలి..
- June 28, 2020
మస్కట్:కరోనా నేపథ్యంలో విమాన ప్రయాణికులకు ఒమన్ ప్రభుత్వం కొన్ని కీలక సూచనలు చేసింది. త్వరలోనే కమర్షియల్ విమాన సర్వీసులను ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్న ఒమన్ ప్రభుత్వం..ఇక నుంచి ప్రయాణికులు అందరూ ఫ్లైట్ టైంకి 4 గంటల ముందే ఎయిర్ పోర్టుకు చేరుకోవాలని సూచించింది. ఈ మేరకు ఒమన్ లోని విమానాశ్రయాలకు ఆదేశాలు కూడా జారీ చేసింది. అంతేకాదు వీలైనంత వరకు ప్రయాణానికి అవసరమయ్యే ప్రక్రియను ఆన్ లైన్ లోనే పూర్తి చేసుకోవాలని కోరింది. అలాగే టికెట్ల కొనుగోళ్లలోనూ ఈ-టికెట్లకే ప్రధాన్యత ఇవ్వాలంది. ప్రయాణికులు తమ వెంట ఒకే ఒక్క హ్యాండ్ బ్యాగ్ తీసుకొచ్చేందుకు మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. ఎయిర్ట్ పోర్ట్ టెర్మినల్ లో ఉన్నంత సేపు ఖచ్చితంగా మాస్కులు ధరించే ఉండాలని కూడా ప్రభుత్వం సూచించింది. ఒకవేళ ఎవరికైనా కోవిడ్-19 లక్షణాలు ఉన్నట్లు అనిపిస్తే విమానాశ్రయానికి రావొద్దని కోరింది. అలాంటి వారు వెంటనే సంబంధిత ఆరోగ్య కేంద్రానికి వెళ్లి చెకప్ చేయించుకోవాలని ప్రభుత్వం సూచించింది.
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!







