షార్జా:కనీస వసతులు లేకుండా కష్టాల్లో భారత కార్మికులు..ఆదుకున్న ఇండియన్ అసోసియేషన్
- June 28, 2020
షార్జా:కరోనా నేపథ్యంలో కనీస వసతులు కూడా లెకుండా కష్టాలు పడుతున్న భారత కార్మికులను షార్జా పోలీసులు, కార్మిక శాఖ, ఇండియన్ అసోసియేషన్ షార్జా ప్రతినిధులు ఆదుకున్నారు. ఓ భవన నిర్మాణ ప్రాంతంలో చిక్కుకుపోయిన దాదాపు 300 మంది కార్మికులను అక్కడి నుంచి తరలించారు. కార్మికులు పని చేసే చోట కనీసం ఆహారం కూడా సరిగ్గా అందలేదు. అంతేకాదు..మండే ఎండలో వారికి ఏసీ ఏర్పాటు చేయలేదు. టాయిలెట్స్ సౌకర్యం కూడా లేదు. కరోనా వ్యాపిస్తున్న సమయంలో అంతటి దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటూ కష్టాలు పడుతున్న కార్మికుల గురించి తెలుసుకున్న టీపీసీసీ ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ ఎస్వీ రెడ్డి, ఏపీ కాంగ్రెస్ సదత్ సౌదాగర్ చొరవ తీసుకున్నారు. వీరితో పాటు..ఇండియన్ అసోసియేషన్ షార్జా అధ్యక్షుడు ఈ.పీ. జాన్సన్, యాక్టీవ్ ట్రెజరర్ షాజీ జాన్, ఐఏఎస్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యుడు అహ్మద్ షిబ్లి సాయంతో నిర్మాణ ప్రదేశంలో చిక్కుకుపోయిన 300 మంది కార్మికులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. షార్జా ఇండియన్ స్కూల్, షార్జా పోలీసులు భారత కార్మికులను తరలించేందుకు 13 బస్సులను ఏర్పాటు చేసింది.



తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







