కువైట్: ఇక ఆన్ లైన్ లోనూ డ్రైవింగ్ టెస్ట్ స్లాట్ బుకింగ్...

- June 28, 2020 , by Maagulf
కువైట్: ఇక ఆన్ లైన్ లోనూ డ్రైవింగ్ టెస్ట్ స్లాట్ బుకింగ్...

కువైట్ సిటీ:డ్రైవింగ్ టెస్ట్ హజరయ్యేందుకు ఇక నుంచి తప్పనిసరిగా ముందస్తు అపాయింట్మెంట్ తీసుకోవాల్సిందేనని అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ముందస్తు అపాయింట్మెంట్ లేకుండా ఎవరూ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ బిల్డింగ్ లోకి అడుకు కూడా పెట్టొద్దని అధికారులు స్పష్టం చేశారు. డ్రైవింగ్ టెస్టుకు హజరుకావాలనుకునేవారు ముందస్తుగా అపాంయిట్మెంట్ ను బుక్ చేసుకునేందుకు ఆన్ లైన్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. అంతర్గత మంత్రిత్వ శాఖకు చెందిన www.moi.gov.kw వెబ్ సైట్ లో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత అందులోని ఈ-సర్వీస్ ను ఎంపిక చేసుకోవాలి. అందులోని ట్రాఫిక్ జనరల్ డిపార్ట్మెంట్ ను సెలక్ట్ చేసుకుంటే డ్రైవింగ్ టెస్టుకు సంబంధించి అపాయింట్మెంట్ బుకింగ్ పేజీ ఓపెన్ అవుతుంది. అందులో మీ వివరాలను నమోదు చేసుకోవాలి. అయితే..దరఖాస్తుదారుడు తప్పనిసరిగా ట్రాఫిక్ డిపార్ట్మెంట్ జారీ చేసిన సరైన పత్రాలు కలిగి ఉండాలి. ఒకవేళ పత్రాల్లోని గడువు ముగిస్తే తప్పసరిగా రెన్యూవల్ చేసుకున్నదై ఉండాలని అధికారులు స్పష్టం చేశారు. 

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com