పి.వి శతజయంతి ఉత్సవాలు ప్రారంభం
- June 28, 2020
హైదరాబాద్: మాజీ ప్రధానమంత్రి పి.వి. నరసింహారావు శతజయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇవాళ ఉదయం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ నెక్లెస్‌రోడ్‌లోని పి.వి జ్ఞానభూమిలో ప్రారంభించారు. ఆదివారం నుంచి ఏడాది పాటు ప్రపంచ వ్యాప్తంగా పి.వి శతజయంతి ఉత్సవాలు నిర్వహించనున్నారు. ముందుగా పి.వి చిత్రపటం వద్ద పుష్పాంజలిఘటించారు. అనంతరం భజన సంకీర్తనలు, సర్వమత ప్రార్థనలు నిర్వహించారు.
సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్‌గౌడ్, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, తెరాస పార్లమెంటరీ పక్ష నేత కేశవరావు, మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు పి.వి చిత్రపటం వద్ద నివాళులర్పించిన వారిలో ఉన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?