హీత్రో విమానాశ్రయంలో కొందరి ఆకతాయి చేష్టలతో ఉత్కంఠo..

- February 02, 2016 , by Maagulf
హీత్రో విమానాశ్రయంలో కొందరి ఆకతాయి చేష్టలతో ఉత్కంఠo..

లండన్‌లో అత్యంత రద్దీగా ఉండే హీత్రో విమానాశ్రయంలో కొందరి ఆకతాయి చేష్టలతో ఉత్కంఠ నెలకొంది. ఇక్కడ ల్యాండ్‌ కాబోతున్న దుబాయి విమానం కాక్‌పీట్‌పై కొందరు ఆకతాయిలు భూమిపై నుంచి ఆకుపచ్చరంగు లేజర్‌ లైట్లను వేశారు. దీంతో తమని ఎవరో టార్గెట్‌ చేస్తున్నారనుకొని పైలెట్లు కొంతసేపు గందరగోళానికి గురయ్యారు. లండన్‌ పోలీసులు దీనిని మూర్ఖపు చర్యగా అభివర్ణించారు. ఇటువంటి పనులు అత్యంత ప్రమాదకరమైనవని హెచ్చరించారు. హీత్రో విమానాశ్రయంలో ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని విమానాశ్రయ ప్రతినిధి తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com