తెలంగాణ:కొత్తగా 945 కరోనా కేసులు
- June 30, 2020
హైదరాబాద్:తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 945 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 16,339కి చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. తాజాగా కరోనా నుంచి కోలుకున్న 1,712 డిశ్చార్జ్ కావడంతో.. ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 7,294గా నమోదైంది. ప్రస్తుతం రాష్ట్రంలో 8,795 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొత్తగా కరోనాతో మరో ఏడుగురు మృతిచెందడంతో మొత్తం మృతుల సంఖ్య 260కి చేరింది. తాజాగా నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలోనే 869 ఉన్నాయి.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







