దుబాయ్: నూతన ఇండియన్ కాన్సుల్ జనరల్ గా అమన్ పూరి

- July 01, 2020 , by Maagulf
దుబాయ్: నూతన ఇండియన్ కాన్సుల్ జనరల్ గా అమన్ పూరి

దుబాయ్ లోని ఇండియన్ కాన్సులేట్ లో కాన్సులేట్ జనరల్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న విపుల్ స్థానే కొత్తగా కాన్సల్ జనరల్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు 'అమన్ పూరి'. ప్రస్తుతం UK లోని బర్మింగ్‌హామ్‌లోని ఇండియన్ కాన్సులేట్‌కు ఇన్‌చార్జిగా ఉన్న అమన్ పూరి(44) దుబాయ్‌లో తదుపరి కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా గా వ్యవహరించనున్నారు. 

ఏప్రిల్ 2017 లో మిషన్ బాధ్యతలు స్వీకరించిన ప్రస్తుత కాన్సుల్ జనరల్ విపుల్ తన తదుపరి పోస్టింగ్ కోసం జూలై 7 న వందే భారత్ మిషన్ ద్వారా స్వదేశానికి తిరిగి వచ్చే విమానంలో న్యూ ఢిల్లీ కి బయలుదేరుతారు. "జూలై మధ్యలో డాక్టర్ పూరి బాధ్యతలు స్వీకరిస్తారు" అని విపుల్ తెలిపారు.

అమన్ పూరి గురించి క్లుప్తంగా..
దంతవైద్యుడుగా పనిచేస్తున్న డాక్టర్ అమన్ పూరి భారత్ సర్వీసులపై గల ఆసక్తితో 2003 లో భారత విదేశాంగ సేవలో సభ్యుడిగా చేరారు.. 2005-08లో బ్రస్సెల్స్ కేంద్రంగా ఉన్న యూరోపియన్ యూనియన్, బెల్జియం మరియు లక్సెంబర్గ్ లకు భారత మిషన్‌లో పనిచేశారు. అతను చండీగఢ్ లోని పాస్పోర్ట్ కార్యాలయంలో 2009-10 నుండి ఒక సంవత్సరం పాటు పనిచేశారు. 

తదనంతరం 2010-2013 వరకు డిప్యూటీ చీఫ్ ఆఫ్ ప్రోటోకాల్ (సెరిమోనియల్) పదవిలో  అమన్, భారత ప్రధానమంత్రి యొక్క విదేశీ సందర్శనలను, రాష్ట్రాల అధిపతులు, ఉపాధ్యక్షులు మరియు విదేశాంగ మంత్రులు, ప్రభుత్వ పెద్దల స్థాయిలో వచ్చే సందర్శనలను నిర్వహించడం వంటి బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించారు. అలాగే, డాక్టర్ పూరి 2013-16 నుండి న్యూ ఢిల్లీ ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారిగా ఉన్నారు.

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com