ఇరాన్:ఆస్పత్రిలో గ్యాస్ లీక్‌తో పేలుడు.. 19 మంది మృతి
- July 01, 2020
టెహ్రాన్:ఇరాన్ రాజధానిలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. టెహ్రాన్‌లోని ఓ మెడికల్ క్లినిక్‌లో మంగళవారం గ్యాస్ లీక్ అవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 19 మంది సజీవ దహనమయ్యారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాద సమయంలో క్లినిక్‌లో 25 మంది సిబ్బంది ఉన్నట్లు టెహ్రాన్ డిప్యూటీ గవర్నర్ రెజా గౌదర్జీ తెలిపారు. రెండు గంటలపాటు అగ్నిమాపక సిబ్బంది కష్టపడి మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.
కాగా ఇరాన్‌లో ఇది రెండవ ఘటన అని గతవారం కూడా టెహ్రాన్ సమీపంలో గ్యాస్ లీకేజీ ఘటన చోటు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. అక్కడి సైనిక ప్రదేశానికి సమీపంలో ఉన్న గ్యాస్ నిల్వ కేంద్రం వద్ద ట్యాంకర్ పేలీ మంటలు చెలరేగినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరిగిందన్న దానిపై సమాచారం లేదు.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







