ప్రముఖ దుబాయ్ రోడ్లపై హెవీ ట్రక్స్ మూమెంట్‌పై బ్యాన్
- July 02, 2020
దుబాయ్ పోలీస్ జనరల్ హెచ్‌క్యు మరియు రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ వెల్లడించిన వివరాల ప్రకారం, దుబాయ్‌లోని ప్రముఖ రోడ్లపై 2.5 టన్నుల కంటే ఎక్కువ టేర్ వెయిట్ వున్న వాహనాల మూమెంట్‌పై బ్యాన్ విధించినట్లు తెలుస్తోంది. శనివారం నుంచి ఈ బ్యాన్ అమల్లోకి వస్తుంది. అల్ ఇత్తిహాద్ మరియు షేక్ జాయెద్ రోడ్లపై ఈ నిబంధనలు వర్తిస్తాయి. షేక్ రషీద్ స్ట్రీట్ అలాగే డౌన్‌టౌన్ డేరా / బుర్ దుబాయ్ రోడ్లపైనా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు హెవీ ట్రక్స్ మూమెంట్‌పై బ్యాన్ వుంటుంది. పార్షియల్ బ్యాన్ దుబాయ్‌లోని మిగతా రోడ్లపై పీక్ టైంస్లో వుంటుంది. అంటే ఉదయం 6.30 నిమిషాల నుంచి 8.30 నిమిషాల వరకు అలాగే మధ్యాహ్నం 1 గంటల నుంచి 3 గంటల వరకు అలాగే సాయంత్రం 5.30 నిమిషాల నుంచి రాత్రి 8 గంటల వరకు.ఎయిర్ పోర్ట్ మరియు షిందగా టన్నెల్స్, అల్ మక్తుం మరియు ఫ్లోటింగ్ బ్రిడ్జిలపైనా బిజినెస్ బే క్రాసింగ్‌పైనా పూర్తి బ్యాన్ కొనసాగుతుంది.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







