మళ్ళీ తండ్రి అయిన ప్రకాష్ రాజ్
- February 03, 2016
టాలెంటెడ్ క్యారెక్టర్ యాక్టర్ ప్రకాష్ రాజ్ సంతోషంలో మునిగితేలుతున్నాడు. ఎందుకంటే 50 ఏళ్ల వయసులో ఆయన మళ్లీ తండ్రియ్యాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. తమకు బాబు పుట్టాడని.. తమ జీవితాల్లో ఆనందకరమైన ఈ క్షణాలను మీతో పంచుకోవాలను కుంటున్నామంటూ ట్విట్టర్ లో ఈ శుభవార్తను అందించాడు. భార్య పోనీ, తాను చాలా సంతోషంగా ఉన్నామన్నామని తెలిపాడు. తమ బిడ్డను ఆశీర్వదించండి అంటూ ట్విట్ చేశాడు. దీంతో సినీరంగానికి చెందిన ప్రముఖులు, ఇతర సెలబ్రిటీలు ప్రకాష్ రాజ్ దంపతులను అభినందలనతో ముంచెత్తారు.మొదటి భార్య లలితతో విడిపోయిన అనంతరం పోనీ వర్మను ప్రకాష్ రాజ్ పెళ్లిచేసుకున్నాడు. లలిత, ప్రకాష్ రాజ్ దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అయితే 2004లో గాలిపటం ప్రమాదంలో అయిదేళ్ల కొడుకును పోగొట్టుకోవడం రాజ్ జీవితంలో పెద్ద విషాదంగా మిగిలింది. ఇపుడు ఈ బాబు రూపంలో మళ్లీ ఆయన జీవితంలో కొత్త సంతోషాలను మోసుకొచ్చాడనే చెప్పాలి.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







